ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
ఇల్లెందురూరల్: ప్రతీ విద్యార్థి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా చదవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మండలలలోని సుదిమళ్ల గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ, విద్యా బోధన ఎలా ఉన్నాయి.. మార్కులెలా వస్తున్నాయంటూ ఆరా తీశారు. వంట గదులను పరిశీలించి పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని సిబ్బందిని ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, వంట సామగ్రిని వినియోగించాలన్నారు. ఆయన వెంట ఆర్‌సీఓ నాగార్జున్‌రావు, ఏటీడీఓ రాధమ్మ, గిరిజన సంక్షేమ ఈఈ చంద్రశేఖర్, ఏఈ సాలార్, రాజు, ప్రిన్సిపాల్ మాధవి, రత్నకుమారి ఉన్నారు.
గ్రంథాలయం తనిఖీ..
ఇల్లెందు: పట్టణంలోని జేకే వద్ద ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న గ్రంథాలయాన్ని పీఓ పరిశీలించారు. వసతి సదుపాయాలపై పలు సలహాలు సూచనలు చేశారు. పుస్తకాలు ర్యాక్‌ల్లో క్రమపద్ధతిన అమర్చాలని, నిరుద్యోగులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పాఠకులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ డి.రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment