తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలి
భద్రాచలంటౌన్: విద్యార్థులు చదువు, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలుగు భాషపై చిన్నతనం నుంచే మక్కువ పెంచుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగగా, ముఖ్య అతిథిగా హాజరైన పీఓ మాట్లాడారు. విద్యార్థుల క్రమశిక్షణ, గతేడాది దాతల సహకారంతో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలల ను నిజం చేయాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీసీ చీఫ్ మేనేజర్ చెంగలరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎంఈఓ రమ, మాధవరెడ్డి పాల్గొన్నారు.
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రూప్– ఈ పోస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువత ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని పీఓ రాహుల్ సూచించారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లించాలని, పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 7729961197 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment