● ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడి
కొత్తగూడెంటౌన్: జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో జిల్లాలో 40 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఐదు బృందాలుగా ఏర్పడి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని పేర్కొన్నారు. గుర్తించిన 40 మంది బాల కార్మికుల్లో 33 మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రదేశాల్లో పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మంది యజ మానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించా రు. బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన అధికా రులను అభినందించారు. ఎవరైనా బాల కార్మికులను గుర్తిస్తే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
కార్మిక సంక్షేమానికి పెద్దపీట
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీలోని కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, యూనియన్ ఐటీసీ అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్ అన్నారు. సారపాకలోని సంఘం కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ యూనియన్‌ను గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. 14వ వేతన ఒప్పందంలో మెరుగైన ప్యాకేజీని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా విద్య, వైద్యపరంగా వసతులు కల్పిస్తామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. పర్మనెంట్ కార్మికుల ప్రయోజనాలతో పాటు బదిలీ, కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలనూ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమ విస్తరణ, ఉద్యోగ, ఉపాధి కల్పనకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు గల్లా నాగభూషయ్య, గాదె రామకోటిరెడ్డి, వి.రత్నాకర్, బి.భాస్కర్, డి. శేషిరెడ్డి, సీహెచ్ మహేశ్వరరావు, కె.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment