గిరిజన కళలను రక్షించుకుందాం
టేకులపల్లి: ప్రస్తుత ఆధునిక యుగంలో గిరిజన ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అంతరించిపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఈఓ ముమ్మడి వెంకటేశ్వరా చారి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కల్చరల్ మీట్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గిరిజన సంప్రదాయాలపై విద్యార్థులు వేసిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ, గిరిజనుల కళలు, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒక్కో పాఠశాల చొప్పున ఎంపిక చేసి కల్చరల్ మీట్ నిర్వహిస్తోందని, జిల్లాలో టేకులపల్లి పాఠశాల ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. టేకులపల్లి విద్యార్థుల కళాత్మక నైపుణ్యం అభినందనీయమని, చదువుతో పాటు ఆట పాటల్లో ముందున్నారని ప్రశంసించారు. కల్చరల్ మీట్‌ను విజయవంతం చేసిన హెచ్‌ఎం మెరుగు శ్రీనివాస్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ జగన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు నాగ రాజశేఖర్, సతీష్, సైదులు, అన్నామణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment