రామయ్య భూముల రక్షణకు కృషి
ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్
డీవీజీ.శంకర్‌రావు
భద్రాచలంటౌన్/దుమ్ముగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన భూముల ఆక్రమణ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి రక్షణకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ.శంకర్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన భద్రాచలం రామాలయానికి రాగా ఆర్చకులు స్వాగతం పలికి స్వామి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఏపీలోని పురుషోత్తపట్నంలో గల ఆలయ భూముల ఆక్రమణలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు కోరగా సత్వరమే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని శంకర్‌రావు చెప్పారు. ఆ తర్వాత దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో కూడా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శంకర్ రావు దర్శించుకున్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొర్ర రామలక్ష్మి, వడిత్య శంకర్‌నాయక్, లిల్లీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment