![మంచి స్నేహం ఉన్నతికి తోడ్పడుతుంది](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09yld59-192010_mr-1739127470-0.jpg.webp?itok=mlAABZ7t)
మంచి స్నేహం ఉన్నతికి తోడ్పడుతుంది
ఇల్లెందురూరల్: ప్రతీ ఒక్కరి జీవన విధానంపై స్నేహితుల ప్రభావం ఉంటుందని, మంచి స్నేహతులు కలిగి ఉన్న వారే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని చెన్నంగులగడ్డ గ్రామంలో దివంగతుల మిత్రల జ్ఞాపకార్థం కొమరంభీం యూత్ ఆధ్వర్యాన నిర్వహించిన ఎనిమిది మండలాల కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీల్లో కూటాన్‌తండా, గురిమెళ్ల, చెరువుకొత్తగూడెం, చెన్నంగులగడ్డ గ్రామాల జట్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలవగా.. ఎమ్మెల్యే వారికి జ్ఞాపిక, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ, మాజీ ఎంపీటీసీ పూనెం లింగమ్మ, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం నామనాయక్, గ్రామ పెద్దలు చాట్ల స్వామి, అలెం సారయ్య, కల్తి భిక్షం, అలెం అంజయ్య, పాయం లక్ష్మీనర్సు, ఊకే రాజేశ్వరి, నిర్వాహకులు ఈసం సతీష్, పాయం అశోక్, ఈసం నీవన్, అలెం పాపారావు తదతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment