మణుగూరు టు ప్రయాగ్‌రాజ్
మణుగూరు టౌన్: మణుగూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ క్యాషియర్, 63 ఏళ్ల వయసు గల కృష్ణ ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఆదివారం సైకిల్‌పై బయలుదేరారు. 1200 కి.మీ.దూరంలోని ప్రయాగ్‌రాజ్ వరకు ఈ నెల 21న చేరుకుంటానని ఆయన చెప్పారు. ప్రస్తుతం అంతటా కాలుష్య ప్రభావం తీవ్రరూపం దాలుస్తోందని, ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత వాహనాలను సమకూర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కృష్ణ చేపట్టిన యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు దుస్సా సమ్మయ్య, వలసాల వెంకటరామారావు, గాండ్ల సురేశ్, ఆర్టీసీ కార్మికుడు ఉపేందర్ ఉన్నారు.
సైకిల్‌పై బయలుదేరిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment