పోస్టాఫీస్‌లో చోరీకి యత్నం
టేకులపల్లి: టేకులపల్లి మండల కేంద్రంలోని సబ్ పోస్టాఫీస్‌లో గుర్తు తెలియని ఓ దొంగ చోరీకి యత్నించాడు. టేకులపల్లి ఎస్‌ఐ పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సబ్ పోస్టాఫీస్ తలుపులు ఆదివారం పగలకొట్టి ఉండడంతో ఇంటి యజమాని సబ్ పోస్టు మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన వచ్చి ఆఫీస్ లోపల పరిశీలించగా.. లాకర్‌లోని సుమారు రూ.20వేల నగదు ఉన్నప్పటికీ కంప్యూటర్ మానిటర్, బార్‌కోడ్ స్కానర్ మాత్రం ధ్వంసమై ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోస్టల్ సబ్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ చిన్న యాకయ్య సందర్శించి ఘటనపై ఆరా తీశారు. సబ్ పోస్టు మాస్టర్ ప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోస్టాఫీస్‌లో చోరీకి యత్నం
Comments
Please login to add a commentAdd a comment