రామాలయంలో సహస్ర కలశావాహనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మంగళవారం సహస్ర కలశావాహనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఘ మాస ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో సహస్ర కలశాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో మొదట కలశావాహనం జరిపారు. బేడా మండపంలో వెయ్యి కలశాలను వరుస క్రమంలో అమర్చి శాస్త్రోక్తంగా దేవతలను ఆవాహన చేశారు. ఈ సందర్భంగా యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ, హవనం, మండప, వాస్తు పూజలు జరిపించారు. ఈ వేడుకల నేపథ్యంలో స్వామి వారి నిత్యకల్యాణం, పవళింపు సేవ రద్దు చేశారు. కాగా, బుధవారం శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి సహస్ర కలశాభిషేకం, శ్రీ రంగనాథ స్వామి వార్షిక తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
నేడు రామయ్యకు సహస్ర కలశాభిషేకం
రామాలయంలో సహస్ర కలశావాహనం
Comments
Please login to add a commentAdd a comment