![పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kgm421-192034_mr-1739302750-0.jpg.webp?itok=hNANZ9T5)
పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 27న జరిగే పోలింగ్ ప్రక్రియపై అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్, సహాయక ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు మొత్తం 74 మందికి కలెక్టరేట్‌లో మంగళవారం మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుందని అన్నారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. గడువులోగా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి వారితో ఓటు వేయించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులను తమ పర్యవేక్షణలో ఉంచుకోవాలని పీఓలకు సూచించారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి వెంకటేశ్వరాచారి, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, డీఎల్‌ఎంటీ సాయికృష్ణ, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment