కారేపల్లి: డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) వరకు నిర్మించే డబ్లింగ్ లైన్ కోసం రైల్వే, రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. లైన్ ఏర్పాటులో భాగంగా సేకరించాల్సిన ఇళ్లు, వ్యవసాయ భూముల వివరాలు సేకరించారు. కాగా, కారేపల్లి రైల్వే స్టేషన్ సమీపాన ఇళ్లు కోల్పోనున్న వారు తమకు పరిహారం చెల్లించడమే కాక ఇళ్లు కట్టించి ఇవ్వాలని గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈనేపథ్యాన అధికారులు మరోమారు సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది. రైల్వే జేఈ శ్రీకాంత్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు, సర్వేయర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment