![మాతృ మరణాలను నియంత్రించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11asp43-192050_mr-1739302749-0.jpg.webp?itok=4RFecwvz)
మాతృ మరణాలను నియంత్రించాలి
డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్
కొత్తగూడెంఅర్బన్ : మాతృ మరణాలను నియంత్రించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్‌నాయక్ అన్నారు. జిల్లాలోని సెకండ్ ఏఎన్‌ఎంలకు మంగళవారం కలేక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు గర్భం దాల్చిన 12 వారాల్లోపు ఎంసీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ గర్భిణికి పరీక్షలు చేయాలని, ప్రమాదకర వ్యాధులుంటే సకాలంలో పెద్దాస్పత్రికి పంపించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఎన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆర్‌పీ చైతన్య, డాక్టర్ బాలాజీ, డిప్యూటీ డెమో ఎండీ ఫైజ్‌మొహిఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐఎంఏ ప్రతినిధులు, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ.. పరీక్షలకు సంబంధించి ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్లు చంద్రకళ, రత్నమణి, తిరుపతి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట పీహెచ్‌సీలో తనిఖీ..
దమ్మపేట : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం పలు ప్రైవేట్ రక్త పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మందలపల్లిలో అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, ఇంజెక్షన్లు వినియోగిస్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడిని గుర్తించి క్లినిక్‌ను సీజ్ చేశారు. కార్యక్రమంలో డీఐఓ బాలాజీ, స్థానిక వైద్యులు మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment