కరోనా మహమ్మరి కారణంగా వేగం తగ్గిన కొలువుల నియామకాల ప్రక్రియ తిరిగి పుంజుకొనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 21 రంగాలలో 700కు పైగా చిన్న, మధ్యస్థ, పెద్ద కంపెనీల నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తుంది. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన తాజా టీమ్ లీజ్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ నివేదిక ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్ భయాలు ఉన్నప్పటికీ 38% కంపెనీలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 34% అధికంగా నియామకాల ప్రక్రియను చేపట్టాయి. టీమ్ లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితూపర్నా చక్రవర్తి మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాలలో కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
లాక్ డౌన్ ఆంక్షలను సడలించడం, వినియోగదారుల డిమాండ్ పెరగడం, ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల బ్లూ-కాలర్, వైట్ కాలర్ నిపుణుల నియామకాన్ని సంస్థలు చేబడుతున్నాయని అన్నారు. జాబ్ మార్కెట్ గణనీయంగా కొలుకొనున్నట్లు దాల్మియా సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింఘి చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, కొన్ని పరిశ్రమలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అనేక రంగాలలో కొత్త నియామకాల వేగం పెరగింది అన్నారు. వ్యాక్సినేషన్ స్థాయిలు పెరగడం కూడా ఈ ధోరణికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. హిరానందనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హిరానందనీ మాట్లాడుతూ.. అన్ని సూచికలు అధిక స్థాయి వృద్ధికి సిద్ధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను సూచిస్తున్నాయి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment