దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 24,354కు చేరింది. సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగి 80,222 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 105.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం, నాస్‌డాక్ 0.88 శాతం లాభపడ్డాయి.
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింత ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం.
ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ.50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4న రూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment