![భర్త నాగరాజుతో శాంతి (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/14/13ctr12-300005_mr_0.jpg.webp?itok=mVagV893)
భర్త నాగరాజుతో శాంతి (ఫైల్)
చిత్తూరు అర్బన్: నగరంలోని జయలక్ష్మికాలనీకి చెందిన శాంతి (36) అనే వివాహిత శనివారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాలు.. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన శాంతికి 12 ఏళ్ల క్రితం చిత్తూరుకు చెందిన నాగరాజుతో వివాహమైంది. పదేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహ సమయంలో శాంతి కుటుంబసభ్యులు రూ.2లక్షలు, పది సవర్ల బంగారాన్ని కట్నం కింద నాగరాజుకు అందించారు. నాగరాజు బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఇంట్లోనే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం సమయంలో భార్య,భర్త ఘర్షణ పడ్డారు. తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ శాంతి, తన తల్లికి ఫోన్ చేసి చెప్పి బాధపడింది. రాత్రి 11.30 గంటల సమయంలో తాను మిద్దైపె నుంచి దూకి చచ్చిపోతానంటూ భర్తకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో రెండో అంతస్తుపైనుంచి శాంతి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు వేలూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యతో మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న శాంతి తల్లి పార్వతి చిత్తూరుకు చేరుకున్నారు. తన కుమార్తెను అత్తింటి వారే మిద్దైపె నుంచి కిందకు తోసి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు శాంతి భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment