![కిక్కిరిసిన బోయకొండ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09pgr21-300048_mr-1739128389-0.jpg.webp?itok=KN4VB-OG)
కిక్కిరిసిన బోయకొండ
● రద్దీగా క్యూలైన్‌లు ● మొక్కులు చెల్లించుకున్న భక్తులు
చౌడేపల్లె : ప్రము ఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివా రం కిటకిటలాడింది. కోరిన కోర్కెలు తీర్చే గంగ మ్మ ఆశీర్వదించమ్మా అంటూ పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మ వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మాఘమాసం సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలతో ఆల యం వద్దకు చేరుకొని గంగమ్మకు పూజలు చేశారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి పూజలు చేసి మొక్కు లు చెల్లించారు. చిరు జల్లులను సైతం భక్తులు లెక్క చేయకుండా దర్శన కోసం భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనె దీపాలు, దీవెలతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
మద్యం విక్రేత అరెస్టు
చౌడేపల్లె : మండలంలోని బోయకొండ మార్గంలోని ఊటూరు బస్‌స్టాప్ వద్ద మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఊటూరుకు చెందిన చంద్రబాబు బస్‌స్టాప్ వద్ద మద్యం విక్రయిస్తుండగా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని వద్ద గల 12 క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా రిమాండుకు ఆదేశించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment