![పట్టుబడ్డ ఎర్రచందనం?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ptp45-300010_mr-1739128389-0.jpg.webp?itok=1hAhKCdM)
పట్టుబడ్డ ఎర్రచందనం?
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు మండలంలోని దిగువ కండ్రిగ గ్రామంలో శనివారం రాత్రి ఎర్రచందనం కలకలం రేపింది. 8 దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దుంగలను స్వాధీనం చేసుకుని.. కూటమి నేతను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో బడా నేతలు పట్టుబడ్డ వ్యక్తిని వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అటవీశాఖ అధికారుల వివరాల మేరకు...చిత్తూరు మండలం దిగువ కండ్రిగ సమీపంలో ఓ పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ వెనుక ఉన్న ఓ ప్రభుత్వ భూమిలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కొట్టేశారా లేదా..గాలికి పడిపోయిందా అనే విషయం తెలియడం లేదు. ఈ దుంగలను ఓ కూటమి నేత ఇంటికి తెచ్చుకున్నాడు. ఈ దుంగలను అమ్మకానికి వ్యా పారులతో బేరసారాలు చేసినట్లు గ్రామస్తు లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం ఊరంతా పాకింది. దీంతో గ్రామస్తులు అట వీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఈస్ట్ అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆ తర్వాత దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం కూటమిలోని బడా నాయకులతో తెలియడంతో పట్టుబడ్డ వ్యక్తిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. వెంటనే వదిలిపెట్టాలని హుకుం జారీ చేశారు. అయితే ఈ విషయం బహిర్గతం కావడంతో అటవీ శాఖ అధికారులు కూడా చేసేదీ లేక రెండు గంటల పాటు రెండు పేజీల రిపోర్ట్ రాశారు. ఆ తర్వాత పట్టుబడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దుంగలను వెంట వేసు కుని వెళ్లారు. సోమవారం ఈ దుంగలను డీఎఫ్‌ఓ పరిశీలించనున్నారు. కాగా ఆ వ్యక్తిని వదిలిపెట్టాలని కూటమి నేతల నుంచి అటవీశాఖ అధికారులకు ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.
చిత్తూరు మండలం దిగువకండ్రిగలో కలకలం
దుంగలు స్వాధీనం.. కూటమినేత అదుపులో..!
వదిలేయాలని నేతల ఒత్తిళ్లు
Comments
Please login to add a commentAdd a comment