‘నా భర్తను దారుణంగా కొట్టి చంపేశారు’ | - | Sakshi
Sakshi News home page

‘నా భర్తను దారుణంగా కొట్టి చంపేశారు’

Published Sun, Jan 7 2024 1:48 AM | Last Updated on Sun, Jan 7 2024 1:40 PM

- - Sakshi

చౌడేపల్లె: ‘నా భర్త చెక్కల మురళి(38)’ని ఆయన కుటుంబ సభ్యులే అతి దారుణంగా కొట్టి చంపేశారని మృతుడి భార్య సంపూర్ణమ్మ ఆరోపిస్తూ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన చౌడేపల్లెలో వెలుగు చూసింది. వివరాలిలా.. చౌడేపల్లె టౌన్‌ నాయునివారిపాళ్యంకు చెందిన చెక్కల మురళి ఆర్మీలో విధులు నిర్వహిస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు.

పెద్దపంజాణి మండలం నెర్నిపల్లెకు చెందిన సంపూర్ణమ్మతో వివాహమైంది. అయితే వ్యక్తిగత కారణాలతో వారు వేర్వేరుగా నివసిస్తున్నారు. మురళి మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో ఘర్షణలు తలెత్తాయి. ఈక్రమంలో తల్లిదండ్రుల వద్దనే మురళి నివాసం ఉండగా సంపూర్ణమ్మ తన పుట్టింటిలో నివాసం ఉంది. ఇంతలో ఏమి జరిగిందో కానీ మురళి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు సంపూర్ణమ్మకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరం, గొంతు భాగంలో గాయాలను గుర్తించి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఎస్‌ఐ వాసు కేసు నమోదు చేసి శవాన్ని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement