గ్రామ కంఠం అమ్మేశారు!
● ప్లాట్లుగా మార్చి రూ.లక్షలకు విక్రయం ● ముందుండి నడిపించిన టీడీపీ నాయకులు
కుప్పంరూరల్: ఎక్కడైన ఒక సెంటు భూమి ఆక్రమణకు గురైన, పక్కదారి పట్టిన రెవెన్యూ అధికారులకు ఇట్టే చట్టాలు గుర్తుకు వస్తాయి. ఏకంగా గ్రా మానికి ఆనుకుని ఉన్న విలువైన భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం మొత్తం టీడీపీ నాయకులు ముందుండి నడిపించడం గమనార్హం. కుప్పం మండలం, దాసేగౌనూరు పంచాయతీ బొగ్గుపల్లిలో స ర్వే నంబర్ 8/2లో 31 సెంట్ల గ్రామం కంఠం ఉంది. దీనిపై టీడీపీ నాయకుల కన్నుపడింది. గత ప్ర భుత్వ హయాం నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్ర యత్నించినా అప్పట్లో వీలు కాలేదు. ప్రస్తుతం కూ టమి ప్రభుత్వం రాగానే దేవాలయ నిర్మాణం పేరి ట 31 సెంట్ల భూమిపై నాయకుల కన్నుపడింది. ఆ లోచనే తడవుగా 4 రోజులుగా 31 సెంట్ల స్థలానికి చదును చేశారు. ఆదివారం చదును చేసిన భూమిని 6 సైట్లుగా విభజించి వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఒక్కో ప్లాటు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల విలువ పలికినట్లు గ్రామస్తులు చెప్పా రు. ఆలయ నిర్మాణ చందాల ద్వారా చేపడ తామని కొంత మంది గ్రామస్తులు వారిస్తున్నా, వి నకుండా సైట్లుగా మార్చి విక్రయించారు. ఏదైనా గ్రామ అవసరాలకు ఉపయోగపడే విలువైన గ్రామ కంఠం భూమిని పరుల పాలు చేయడంపై ఆ గ్రామస్తులు కొంతమంది బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.
కడా పీడీకి ఫిర్యాదు
కుప్పం మండలం బొగ్గుపల్లిలో 31సెంట్ల గ్రామకంఠం భూముల అమ్మకంపై గ్రామస్తులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు. దీనిపై కుప్పం తహసీల్దార్ చిట్టిబాబును వివరణ కోరగా, గ్రామ కంఠం పంచాయతీ పరిధిలోకి వస్తుందని, పంచాయతీ నిర్ణయంతో ఏదైనా అవసరాలకు వాడుకోవచ్చని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment