తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : అధికారులు తీరు మార్చుకోకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. సోమ వారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పాడి పశువుల సంక్షేమానికి చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణంలో అలసత్వం ఎందుకని మండిపడ్డారు. పు రోగతి ఎందుకు తక్కువగా ఉందో చెప్పాలని పశుసంవర్థకశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హెచ్చరించారు. కొన్ని మండలాలలో మార్కింగ్ చేసి పనులు ప్రారంభించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. మార్కింగ్ చేసిన చోట పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. 4 స్టేజీల్లో బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చే యాలని ఆదేశించారు. గోకులం షెడ్ల నిర్మాణంలో ఏపీడీలు ఏపీఓలు మార్కింగ్ చేసిన వెంటనే పనులు ప్రారంభించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ హిమ వంశీ, డ్వామా పిడి రవికుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్, జిల్లా సిరికల్చర్ అధికారి శోభారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment