వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పూతలపట్టు: దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పూతలపట్టు మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూతలపట్టు మండలంలోని మూర్తిగానూరులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా విగ్రహం తల, మిగిలిన భాగం వేర్వేరు చోట్ల పడి ఉండడాన్ని గమనించి, వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియజేశారు. అనంతరం వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కృష్ణమోహన్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునిల్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను శిక్షించాలని కోరారు. పార్టీ నాయకురాలు శైలజా చరణ్ మాట్లాడుతూ నిందితులను వేగవంతంగా గుర్తించి, వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాలుగు నెలల క్రితం కూడా..
సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజు పూతలపట్టు మండలంలోని ఎగువపాలకూరులో టీడీపీకి చెందిన కార్యకర్తలు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ఘటన జరిగిన నెల తరువాత అదే విగ్రహానికి ఉన్న శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment