పోలీస్ గ్రీవెన్స్‌కు 37 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలోని జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. సోమవారం ఎస్పీ మణికంఠ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ఆన్‌లైన్‌లో సై తం నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్టు షాపుల వేలం
సాక్షిటాస్క్‌ఫో ర్స్ : ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా బెల్టుషాపుల ఏర్పాట్లకు టీడీపీ నాయకు లు శ్రీకారం చు ట్టారు. దీనిపై టీడీపీకి చెందిన రెండు వర్గాలు వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. చౌడేపల్లె మండల టీడీపీ నాయకుడు గ్రామాల్లో బెల్టు షాపుల ఏర్పాటుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసి, వేలం వేసినట్లు అదే పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, వాటిని చౌడేపల్లె కోసం అనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చౌడేపల్లె మండలంలోని యల్లంపల్లి, ఆమినిగుంట, చౌడేపల్లె, గడ్డంవారిపల్లె, బోయకొండ, బత్తలాపురం, సింగిరిగుంట, పరికిదొన, చుక్కావారిపల్లె గ్రా మాల్లో బెల్టుషాపులు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ఈ షాపుల ద్వారా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేలా హుకుం జా రీ చేసినట్లు సమాచారం. ఈ విషయాల ద్వారా పల్లెల ప్రశాంతత దెబ్బతింటోందని, ఈ విషయాలను ఎకై ్సజ్ వారికి తెలిసిన మొద్దు నిద్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment