ఎడాపెడా తోడేయ్!
కౌండిన్య నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చనేతల కనుసన్నల్లో ఇసుక తరలిపోతోంది.
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
అధికారం అడ్డుపెట్టుకుని.. నిబంధనలకు నిలువునా పాతరేసి.. ఇష్టారాజ్యంగా
గ్రానైట్ కొల్లగొడుతున్నారు.
అనుమతులు లేకుండానే
తవ్వకాలు సాగిస్తూ
దోచేస్తున్నారు. అక్రమాలను
అరికట్టాల్సిన గనుల
శాఖాధికారులు నిమ్మకు నీరెత్తిన
చందంగా వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా కొండలు కరిగిపోతున్నాయి.
రూ.కోట్ల ప్రభుత్వ
ఆదాయానికి
గండిపడుతోంది.
కనతల చెరువు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీ
ప్రభుత్వ ఆదాయానికి గండి
సాక్షి టాస్క్‌ఫోర్స్: బంగారుపాళెంలో క్వారీలను కొల్లగొట్టేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందిన కాడికి దోచేస్తున్నారు. రూ.కోట్ల విలువైన గ్రానైట్‌ను కాజేస్తున్నారు. ఈ అక్రమాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జోరుగా సాగుతున్నాయి. అక్రమంగా తవ్వి తీసిన గ్రానైట్ దిమ్మెలను తమిళనాడుకు అడ్డదారిలో తరలించి రూ.కోట్లకు పడగెత్తుతున్నారు. అక్రమార్కుల కోరల్లో చిక్కుకున్న క్వారీ లను విడిపించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు భగ్గుమంటున్నాయి. గనుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మెటల్, గ్రావెల్, గ్రానైట్ క్వారీల నిబంధనలను టీడీపీ నేతలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేపట్టి.. రాత్రికి రాత్రే తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక వ్యాపారం ఓ వైపు నడుస్తుండగా..మరో వైపు గ్రానైట్ అక్రమాలు పుంజుకుంటున్నాయి.
పదుల సంఖ్యలో క్వారీలు
బంగారుపాళ్యం మండలంలో పదుల సంఖ్యలో క్వారీలున్నాయి. ఇందులో చాలా వాటిని అనుమతులు తీసుకోకుండా అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మండలంలోని ఎగువ కనతల చెరువు ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జోరందుకుంటున్నాయి. ఇక్కడ సర్వే నంబర్ 56లో నాలుగు క్వారీలున్నాయి. ఇందులో ఒక క్వారీకి అనుమతులుండగా..మిగిలిన మూడింటికి ఎలాంటి అనుమతులు లేవని స్థానికులు భగ్గుమంటున్నారు. ఓ గ్రానైట్ క్వారీకి సంబంధించిన రెన్యూవల్ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అధికార బలం ఉపయోగించి క్వారీలను వారి వశం చేసుకున్నారు. నిత్యం రూ.లక్షల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలను హద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.
వదిలేస్తారా..?
అనుమతి లేదని తెలుసుకున్న ఆ అధికారులు అధికార పార్టీకి తలొగ్గాల్సి వస్తోంది. బంగారుపాళెం మండలానికి చెందిన ఓ బడా నాయకుడు. చిత్తూరుకు చెందిన నాయకులు కలసి ఈ దందా చేస్తున్నారని తెలుసుకోవడంతో గనులశాఖ అధికారులకు దిక్కుతోచడం లేదు. వదిలేయాలని పైస్థాయి నుంచి ఒత్తిడి ఉంది. అయితే దీనిపై చర్యలు తీసుకుంటారా?..లేదా వదిలి పెడతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు రిపోర్ట్ పెట్టి విచారణను సర్దుబాటు చేసేలా అధికారులకు డైరెక్షన్ వెళుతోంది. ఇంతకీ పట్టుబడ్డ అక్రమ మైనింగ్‌పై ఏం తేలుస్తారో వేచి చూడాల్సి ఉంది.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ప్రభుత్వ
ఆదాయానికి
భారీ గండి
కొరవడిన గనుల శాఖ పర్యవేక్షణ
క్వారీలపై గనులశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్వారీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు చేస్తూ విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా వ్యవహారం సాగుతోంది.
బంగారుపాళెంలో వెలుస్తున్న అక్రమ కార్వీలు
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను టీడీపీ నేతలు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. క్వారీల్లో చాలా వాటికి శాఖ అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు చేస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొండెక్కిన అధికారులు అక్రమ గ్రానైట్‌ను పట్టుకున్నారు. అక్కడి వాహనాలు, గ్రానైట్ దిమ్మెలను లెక్కకట్టారు. ఇంతకీ ఎవరెవరి ఆధ్వర్యంలో ఈ అక్రమ క్వారీలు నడుస్తున్నాయని అధికారులు ఆరా తీశారు. అప్పటికప్పుడే అక్రమ క్వారీ పనులను ఆపాలని అధికారులు కేకలు పెట్టారు. అయినా పట్టించుకోకుండా అక్రమార్కులు యథావిధిగా అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. కొందరు ముడుపులు ముట్టజెప్పి గ్రానైట్ అక్రమ రవాణాను నిరాటంకంగా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
ఎగువ కనతల చెరువులో అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు
పట్టించుకోని మైనింగ్‌శాఖ
అధికారులు
ప్రకృతి ప్రసాదిత గ్రానైట్ క్వారీలు పొరుగురాష్ట్రాలకు అత్యంత సమీపంలోనే ఉన్నాయి
పర్మిట్
లేకుండానే రవాణా
తమిళనాడుకు అడ్డదారిలో
తరలింపు
Comments
Please login to add a commentAdd a comment