పెరుపాదం గేట్లు తెరిచిన అయ్యప్ప భక్తుడు
● శబరిమలైలో జీడిమాకులపల్లె వాసికి దక్కిన అదృష్టం
గంగవరం: నవంబర్ నెల కార్తీక మాసంలో కేరళ రాష్ట్రంలోని పెరుపాదం గేట్లు తెరిచే అదృష్టం మండలంలోని జీడిమాకులపల్లెకు చెందిన అయ్యప్ప భక్తుడు తేజేష్కుమార్కు దక్కింది. 48 రోజుల కఠోర అయ్యప్పమాల దీక్ష చేస్తున్న ఇతడు ఇరుముడి చెల్లించి దీక్ష విరమించేందుకు శబరిమలైకు వెళ్లారు. అక్కడ పోలీసు బందోబస్తు నడుమ అతని చేతుల మీదుగా మొట్టమొదటి సారి పెరుపాదం గేట్లను తెరిపించారు. అంతటి భాగ్యం లభించినందుకు ఆలయ నిర్వాహకులకు, పోలీసులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. తమ గ్రామ అయ్యప్ప భక్తుని చేతుల మీదుగా పెరుపాదం గేట్లు తెరవడం గర్వకారణమని అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment