కుప్పం మండలం బొగ్గుపల్లెలో గ్రామ కంఠం భూమిని అమ్మేశారు. ఈ తతంగాన్ని టీడీపీ నేతలు ముందుండి నడిపించారు
పూజలు చేసి మరీ అక్రమ తవ్వకాలు ప్రారంభం
ఎగువ కనతల చెరువు ప్రాంతంలోని ఆ అక్రమ క్వారీలు యాదమరి మండలం, తమిళనాడులోని పరదారామి సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాంతంలో లభిస్తున్న గ్రానైట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందులోను అక్రమ రవాణాకు మార్గం సులువు కావడంతో ఇక్కడ టీడీపీ నేతలు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు మూడు నెలలకు ముందు పూజలు చేసి, మరీ ప్రారంభించారు. యంత్రాలను రంగంలోకి దింపారు. కొండను కరిగించే పనిలో పడ్డారు. అలా కొండను కరిస్తూ..విలువైన గ్రానైట్‌ను దోచుకుంటున్నారు. ఈ క్వారీ తమిళనాడుకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో గ్రానైట్ బండలను టీడీపీ నేతల సొంత వాహనాల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ దందా కొనసాగిస్తున్నారు. రాత్రి పూట మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే గ్రానైట్ స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలానే కొనసాగితే కొండ కరిగి పోయి, మైదానంగా మారుతుందని వారు వాపోతున్నారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment