ఎన్నో ప్రశ్నలు..
‘కార్డన్‌సెర్చ్...’ ఇటీవల పోలీసులు తరచూ ఉపయోగిస్తున్న పదం. ఓ 30 మంది పోలీసులతో కాలనీల్లోకి తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో వెళ్లడం. నిద్రపోతున్న వారి ఇంటి గేటు కొట్టి నిద్రలేపడం.. బయటి ఉన్న స్కూటర్ రికార్డులు చూపమని అడగటం.. ఇంట్లో గంజాయి, సారా, ఆయుధాల్లాంటివి ఏమైనా ఉన్నాయోమోనని తనిఖీలు చేయడం.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించడానికి వెళుతున్న కాలనీలు, ప్రాంతాల్లో అత్యధిక శాతం ఎస్సీలు, ఎస్టీలు నివసిస్తున్నవి కావడం విమర్శలకు దారిస్తోంది. చిత్తూరు నగరంలో ఇటీవల కార్డన్‌సెర్చ్ నిర్వహించిన ప్రాంతాలు పరిశీలిస్తే ఇరువారం దళితవాడ, సంతపేట ఓబనపల్లె కాలనీ, భరత్‌నగర్ కాలనీ, వెంగళరావు కాలనీ, శ్రీనివాసనగర్ కాలనీ, నీవానది కాలనీ ఇలా చాలా ప్రాంతాలు మురికివాడలు, దళితులు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలే కావడం గమనార్హం. అసలు కార్డన్‌సెర్చ్ లక్ష్యం ఏమిటి..? పోలీసులు ఏం చేస్తున్నారు..? దీంతో సామాన్యులకు కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి.? ఒక్క వర్గం ప్రజలు ఉంటున్న కాలనీల్లోనే కార్డన్‌సెర్చ్‌లు నిర్వహించాలా..? నేరస్తులు కొన్ని కాలనీలకే పరిమితమా..? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సామాన్యుడి మదిని తొలిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment