చిత్తూరు అర్బన్: పోలీసులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఏఎస్పీ రాజశేఖరరాజు అన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. కానిస్టేబుల్, సిబ్బందిలు ఎదుర్కొనే సమస్యలను తన దృష్టికి తీసుకోరావచ్చన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కార్యాలయ ఏఓ నాగభూషణమ్మ, ఏఏఓ దస్తగిరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
బస్సులో బంగారు గొలుసు చోరీ
చౌడేపల్లె: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి హ్యాండ్ బ్యాగ్‌లో బంగారు చైను చోరీ జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా.. పుంగనూరు పట్టణానికి చెందిన విశ్రాంత సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సరస్వతి సోమవారం ఆర్టీసీ బస్సులో సదుంకు బయలుదేరారు. హ్యాండ్‌బ్యాగ్‌లో 24 గ్రాముల బరువు గల బంగారు చైను పెట్టుకున్నారు. అయితే చౌడేపల్లెకు రాగానే హ్యాండ్‌బ్యాగ్ జిప్ తెరుచుకుని ఉండడంతో చూడగా చైన్ చోరీ అయిందని గుర్తించారు. పక్క సీటులో కూర్చున్న మహిళ సైతం అక్కడ నుంచి ఉడాయించగా ఈమె చౌడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్‌ఐ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment