అన్నీ వారికే చెల్లు
తప్పా..? ఒప్పా..!
● కార్డన్ సెర్చ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమా..? ● తరచూ దళితవాడలు.. స్లమ్స్‌లోనే ఖాకీల తనిఖీలు ● మిగిలినచోట్ల అసాంఘిక శక్తులు లేవా..? నేరాలు జరగవా.! ● ఆత్మాభిమానం.. గౌరవ మర్యాదలు కొందరికేనా..? ● పోలీసులకు ఆత్మ పరిశీలన అవసరం
చిత్తూరు అర్బన్: అసాంఘిక శక్తులు చట్టం నుంచి తప్పించుకోకూడదన్నదన్నదే కార్డన్‌సెర్చ్ ప్రధాన లక్ష్యం. ఏదైనా ప్ర దేశంలో అసాంఘిక శక్తులు దాగి ఉన్నట్లు తెలిసినా, గంజాయి, సారా విక్రయాలు, ఆయుధాల కలిగి ఉండడం, చోరీ చేసిన వాహనాలు ఓ చోట దాచి ఉండడం లాంటి సమాచారం పోలీసులకు అందితే.. నిందితులు తప్పించుకోకుండా ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టి చర్యలు తీసుకుంటారు. సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా దొరికితే వారిని అరెస్టు చేయడం, పోగొట్టుకున్న వాహనాలను స్వాధీనం చేసుకోవ డం చేస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కార్డన్ సెర్చ్‌కు పోలీసులు ఎంపిక చేసుకుంటున్న కాలనీలు, ప్రాంతాలు విమర్శలకు దారితీస్తోంది. చాలా చోట్ల ఎస్సీలు, గిరిజనులు, ఎస్టీ జనాభా అ త్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తర చూ కొన్ని ప్రాంతాల్లోనే ఇలాంటి తనిఖీలు చే యడంతో గౌరవ మర్యాదలు తమకులేవా..? అనే ప్రశ్నలు అక్కడి ప్రజల్లో తలెత్తుతోంది. ఇతర సంపన్న కాలనీల్లో కార్డన్‌సెర్చ్‌లు ఎందుకు చేయడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్ణీత వార్డుల ప్రకారం ప్రతీ కాలనీలో ఇలాంటి తనిఖీలు నిర్వహించాలని, ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్ చేయడంతో సమాజంలో తాము వివక్షకు గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం బాగున్నా...!
అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చట్టం నుంచి తప్పించుకోకూడదనే పోలీసుల లక్ష్యం బా గానే ఉన్నా.. ఓ పాత సామెతను గుర్తించుకోవాల్సి న అవసరం ఉంది. వంద మంది నేరస్తులు చట్టం నుంచి తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూదనే సూక్తిని పోలీసులు గుర్తించాలి. కార్డన్‌సెర్చ్ చేయడం నేరం..? మీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు..? అని ఎవరూ ప్రశ్నించడంలేదు. కానీ ఇదే మానవ హక్కులు కూడా ముఖ్యమే. ఓ ఇంట్లో కి వెళ్లి నిద్రపోతున్న కుటుంబాన్ని లేపి తనిఖీలు చేసిన తరువాత ఎలాంటి అసాంఘిక కార్యకలాపా లు జరగలేదని తెలిస్తే, అక్కడ ఏవీ దొరక్కుంటే ఒకరి గౌరవ హక్కులను కాలరాయడమే కదా..! అలాగని సంపన్న శ్రేణులు ఉంటున్న చోట్ల అసాంఘి కార్యకలాపాలు జరగవు.. అని నిర్దారించి సర్టిఫికెట్ ఇచ్చే అధికారం కూడా పోలీసులకు లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించే హక్కు రాజ్యాంగం అందరికీ సమానంగానే కల్పించింది. ఇక చట్టం అందరికీ ఒకేలాగే వర్తింపచేయాలి. దీన్ని పోలీసుశాఖ ఆత్మవిమర్శ చేకోవాల్సిన అవసరం ఉంది.
‘‘ ఇటీవల ఉదయం 5.20 గంటల సమయంలో నిద్రపోతున్న ప్రజలను లేపి వాహనాలకు సంబంధించిన రికార్డులు తీసుకురమ్మని ఆదేశించారు. ఇది చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీ.’’
‘‘ ఉదయం 5.30 గంటలకు నిద్రిస్తున్న కుటుంబాన్ని నిద్రలేపి, ఇంట్లోకి వెళ్లి పోలీసులు తనిఖీలు చేశారు. చిత్తూరులోని సంతపేట దుర్గకాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్ ఇది.’’
నిబంధనల మేరకే..
కార్డన్‌సెర్చ్, సామూహిక తనిఖీలు అనేవి మాకొచ్చే సమాచారం ఆధారంగా చేపడతాం. అలాగే ఒక్కోసారి నేరాలు నమోదవుతున్న ప్రాంతాల ఆధారంగా కూడా జరుగుతుంది. మాకు ఎవరిపైనా వివక్ష లేదు. నిబంధనల మేరకు తనిఖీలు అనేవి జరుగుతాయి. అన్ని ప్రాంతాల్లో కూడా చేయాలనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.
– టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు.
పద్ధతి మార్చుకోవాలి
కార్డన్‌సెర్చ్ అనేది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడంతో ఓ సామాజిక వర్గం ప్రజలను చిన్నచూపు చూసినట్టే అవుతుంది. దొంగతనాలు చేసేవా ళ్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్లు, సంఘ విద్రోహశక్తులు ప లానా చోట ఉన్నట్లు సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇది మంచి పద్ధతికాదు. అలాంటి భావన రాకుండా పోలీసులు వ్యవహరించాలి.
– నాగరాజన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, దళిత హక్కుల పోరాట సమితి
Comments
Please login to add a commentAdd a comment