భావితరాల భవిత నిర్దేశకులు ఉపాధ్యాయులే! | - | Sakshi
Sakshi News home page

భావితరాల భవిత నిర్దేశకులు ఉపాధ్యాయులే!

Published Wed, Nov 27 2024 8:21 AM | Last Updated on Wed, Nov 27 2024 8:21 AM

భావితరాల భవిత నిర్దేశకులు ఉపాధ్యాయులే!

భావితరాల భవిత నిర్దేశకులు ఉపాధ్యాయులే!

– రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు

గుడుపల్లె: భావితరాల భవిషత్తు నిర్దేశకులు ఉపాధ్యాయులేనని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆడిటోరియంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన రీజినల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. విద్యతోనే ఆర్థిక సామాజిక స్థితిగతుల్లో మార్పులు ఉంటాయన్నారు. రేపటి తరానికి ఉత్తమ భవిషత్తు ఇచ్చేలా విద్యార్థులకు వి లువలతో కూడిన బోధనను అందించాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు సన్మార్గంలో నడిచేలా ప్రాథమిక దశ నుంచి అలవాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రయో గాత్మకమైన విద్యను అభ్యసించాలన్నారు. కాలనుగుణంగా సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకుని విలువలతో కూడిన విద్యను అందిచగలిగితేనే ఆ విద్యార్థి భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. అనంతరం అగస్త్య ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ హెడ్‌ సురేష్‌ విజ్ఞాన శాస్త్రంలో చేపట్టిన ప్రాజెక్టులు పరిశోధనలకు సంబంధించిన అంశాలపై పాఠశాల డైరెక్టర్‌ విజయరామరాజుకు, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు వివరించారు. ఆ తరువాత అగస్త్య ఫౌండేషన్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌, డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణరెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, తహసీల్దార్‌ సీతారాం, ఎంఈఓ శ్రీదేవి పాల్గొన్నారు.

108 సేవలు సజావుగా

అందించండి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): 108 సేవల నడపడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతీదేవి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 108 సేవల అమలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పీలను షిఫ్టుల వారీగా విభజించి అత్యవసర సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తాత్కాలికంగా వాహనాలను నడిపేందుకు డ్రైవర్లను సమకూర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోర్డినేటర్‌ సుదర్శన్‌, 108 మేనేజర్‌ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

నేటి యువత చదివింది కొంతే అయినా సూటు, బూటు వేసుకుని కొలువుకు వెళ్లాలనుకుంటారు. సేద్యం అంటే తక్కువగా భావిస్తారు. కానీ ఆయన రెండు పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివారు. ఉన్నత ఉద్యోగం పొందారు. అయినా అధ్యాపక వృత్తి వదలి.. పొలం బాట పట్టారు. సేంద్రియ సేద్యానికి శ్రీకారం చుట్టారు.. దేశవాళీ వరి వంగడాల సాగుపై మొగ్గు చూపి, వ్యవసాయంలోనూ పట్టభద్రుడుయ్యారు. ఆ కర్షక పట్టభద్రుడే పలమనేరు మండలం కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్‌ కుమార్‌రెడ్డి. ఆయన విజయగాథపై ప్రత్యేక కథనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement