రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
చిత్తూరు కలెక్టరేట్ : రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు జా యింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విశేష లక్షణాలున్నాయన్నారు. భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉందన్నారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో జేసీ విద్యాధరి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, హౌసింగ్ పీడీ పద్మనాభం, సాంఘిక మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, చిన్నారెడ్డి, మూర్తి, డీఎల్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment