కూర్మాయిలో సాగు చేసిన దేశవాళి బ్లాక్‌రైస్ (ఇన్‌సెట్)చందూల్‌కుమార్ రెడ్డి
పలమనేరు: పలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్ కుమార్‌రెడ్డి డబుల్ పీజీ చదివారు. సంస్కృత అధ్యాపకుడిగా రెండు దశాబ్దాలు పనిచేశారు. తన తల్లికి బీపీ, షుగర్ కారణంగా ఇబ్బంది పడుతుంటే దీనికి మూలమైన కారణాలను వెతికారు. మనిషి జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణమని గుర్తించారు. దీంతో పాలేకర్ శిష్యుడైన విజయరామ ప్రసంగాలతో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. చేస్తున్న కొలువును వదలి మట్టితో స్నేహం చేయాలని భావించారు. దీంతో తనకు ఉన్న ఐదెకరాల పొలంలో కుటీరాన్ని నిర్మించుకుని అక్కడే ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందుకో సం దేశంలో అంతరించిపోతున్న దేశవాళి వరి వంగడాలను సేకరించారు. వాటిని తన పొలంలో సాగు చే శారు. భవిష్యత్తు తరాలకు ఈ విత్తనాలను అందు బా టులోకి తేవాలనే సంకల్పంతో ముందుకెళుతున్నారు.
అంతరించిపోతున్న దేశవాళి రకాల సాగు
మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన వరి వంగడాలు నేటి హైబ్రిడ్ రకాల రాకతో అంతరించిపోయాయి. అత్యంత విలువైన పోషకాలను కలిగి మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చే దేశవాళి వరి వంగడాలను సాగు చేస్తు న్నారు. అందులో భాగంగా దేశవాళి రకాలైన నవారా, కుజీపటాలియం, బహురూపి, కాలాబాటి, అల్లుడు బి య్యం, చిట్టిముత్యాలు, కోతాంబరి, రత్నచోడి, కకోడి, బైరొడ్లు, రక్తశాలి, పూంగార్, జీరగసాంబ, పోక్కూర్, ఇల్లెపు సాంబ రకాల వరిని తన పొలంలో సాగుచేశారు. ఈ విత్తనాలను ఆసక్తిగల రైతులకు అందుబాటులో ఉంచారు.
ఎన్నో రోగాలకు మందుగా బియ్యం
దేశంలోని పురాతన వరి వంగడాల్లో ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే గుణం ఉంది. ఎరుపు రంగు లో ఉండే నవారా బియ్యం కేరళలో ఎక్కువగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైకోమిన్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. పక్షవాతం బారిన ప డిన వారికి కేరళలో భోజనం వండి పెట్టడంతో పాటు ఇదే అన్నంతో రోగి శరీరంపై మర్థన చేస్తారు. ఇది గాక ఇండియన్ వయాగ్రాగా పిలిచే నవారాను దేశివాళి రకాల్లో సంజీవనిగా పేరుంది. బియ్యం నుంచి మొలకలు రావడం దీని ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment