వరిలో కొత్త కొత్త ప్రయోగాలు
సాధరణంగా వరికి 90 శాతం నీటి అవరసం అవుతుంది. ఇదే విధానంతో రైతులందరూ ఇప్పటికీ వరిని సాగు చేస్తున్నాం. కానీ ఈయన తన మెట్టపొలంలో ఆరుతడి పంటగా వరిని డ్రిప్ సాయంతో నీటినందిస్తూ సాగు చేస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ రైస్, కూజిపటాలియా, బహురూపి రకాలను సాగు చేశాడు. తుపానులు, వరదలొచ్చినప్పుడు వరిమళ్లు నేలవాలి రైతుకు నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి సమస్య లేకుండా వెన్ను వాల్చని వరి వంగడమైన దేశవాళి రకం ఐదు అడుగులు పెరిగే బహురూపిని ప్రస్తుతం ఆయన పొలంలో కోతకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment