కొలువు వదిలి.. కాడి పట్టి..
చందూల్ కుమార్‌రెడ్డి తిరుపతి ప్రాచ్య కళాశాలలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, బీఈడీ చదివారు. సంస్కృత అధ్యాపకుడిగా రెండు దశాబ్ధాలు పనిచేశారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. దీంతో తాను పనిచేస్తున్న కొలువుకు స్వస్తి చెప్పి సేద్యంలోకి దిగారు. ఆయన క్రిమిసంహారక మందులు వాకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వరి పంట ను సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, దేశవా ళి విత్తనాలు, దేశవాళి ఆవుల ద్వారా పంట సాగుపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ రై తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి సేద్యంలో ఇతని కృషిని గుర్తించి, పలు రాష్ట్రాల్లో ఇతనికి సత్కారాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment