వరసిద్ధుడికి రూ.2.50 లక్షల విరాళం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయాభివృద్ధికి బుధవారం ఓ దాత రూ.2.50 లక్షల విరాళం ఇచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన దాసరి రామ్‌ప్రసాద్ ఈ నగదు చెక్కు ను ఆలయాధికారులకు అందజేశారు. అనంతరం ఆయనకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటం అందజేశా రు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
పులిచెర్ల(కల్లూరు): సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పులిచెర్ల మండలంలోని కావేటిగారిపల్లె ప్రధానోపాధ్యాయురాలు మంజువాణి అవార్డు అందుకున్నారు. బుధవారం ఎమ్మార్సీలో ఎంఈఓలు సిద్ధరామయ్య, తాతయ్య, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు.
బాబుకు సాదర వీడ్కోలు
కుప్పం:నియోజకవర్గంలో మూడు రోజుల పర్యట న ముగించుకుని తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఫిర్యాదులు స్వీకరించి 12.40 గంటలకు ద్రావిడ వర్సిటీ వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్, ఎమ్మె ల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఎస్పీ మణికంఠ చందోలు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీడీపీ పా లకవర్గసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు యథాతథం
– డీవీఈఓ సయ్యద్ మౌలా
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా లో ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథ మ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు యఽథాతథంగా నిర్వహిస్తారని ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారాలు అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ రాష్ట్ర అధికారులు సైతం ధ్రువీకరించారన్నారు. జనవరి 26వ తేదీ లోపు ఇంటర్ సంస్కరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఈ ఏడాది పరీక్షలు రద్దు అనే విషయం అవాస్తవమన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అసత్యప్రచారాలను నమ్మకూడదని డీవీఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment