● వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు పోటెత్తిన భక్తులు ● తూత
నిలబడలేం.. కూర్చోలేం.. ఒకే చోట పడిగాపులు.. కనీస వసతులు లేవు.. అన్నపానీయాలు అందలేదు.. పట్టించుకునేవారు లేరు.. వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు దారుణంగా వ్యవహరించారు. వీధులనే క్యూలుగా మార్చి అందులో తోసేశారు.. పిల్లలు.. పెద్దలు.. మహిళలనే జ్ఞానం లేకుండా ఇష్టారాజ్యంగా నెట్టేశారు. ఏమాత్రం నియంత్రణ పాటించకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కౌంటర్ల వద్ద తూతూమంత్రంగా భద్రత కల్పించారు. టోకెన్ తీసుకునేందుకు పోటీపడే దుస్థితిని తీసుకువచ్చారు. వారి నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.పెద్దసంఖ్యలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. చివరకు సహాయక చర్యల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారు. సకాలంలో వైద్యసేవలందించడంలోనూ వైఫల్యం చెందారు.
– తిరుపతి సిటీ/క్రైం/మంగళం/కల్చరల్/అర్బన్
Comments
Please login to add a commentAdd a comment