విద్యుత్ బిల్లు భారం నుంచి ఉపశమనం
శాంతిపురం: తప్పుడు విద్యుత్ వ్యవహారాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడంతో వినియోగదారుడికి ఉపశమనం లభించింది. మండలంలోని ఎంకే పురానికి చెందిన గజ్జల రమేష్‌కు ఐదు నెలల్లో 42 యూనిట్ల విద్యుత్ వినియోగానికిగాను రూ.20.800 బిల్లును రెస్కో సిబ్బంది ఇచ్చారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గత నెల 27వ తేదీన సాక్షి దినపత్రికలో ‘42 యూనిట్లకు రూ.20.800’ శీర్షిన కథనం ప్రచురితం కావడంతో స్పందించిన రెస్కో అధికారులు రూ.1,500కు బిల్లును సవరించి, ఆ మేరకు వినియోగదారుడి నుంచి వసూలు చేశారు.
ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
– వీడియో సమావేశంలో సీడీఎంఏ
హరినారాయణన్
చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజల సమస్యలు పరిష్కరించడంపై కమిషనర్లు దృష్టి సారించాలని రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హరినారాయణన్ ఆదేశించారు. బుధవారం ఆయన మంగళగిరి నుంచి వీడియో సమావేశం నిర్వహించగా.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అనంతపురం ఆర్డీ విశ్వనాథ్, కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేసవి వస్తున్న దృష్ట్యా ప్రజలు నీటి కోసం ఇ బ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ సమస్యల ను వెతుక్కోకుండా.. ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలన్నారు. అన్నా క్యాంటీన్లను కమిషనర్లందరూ రోజూ పరిశీలించాలన్నారు. ఇంటింటా చెత్త సేకరణ, ఆస్తిపన్ను వసూలు, గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. ఈ సమావేశంలో చిత్తూరు సహాయ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ ఇంజినీరు వెంకటరామిరెడ్డి, ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రిటిష్‌కాలం నాటి సర్వే.. నేటికీ అదే ఆచరణతో భూ తగాదాలు.. రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ ప్రదక్షణలు.. ఇదీ దశాబ్దాల భారతం.. ఎక్కడో ఓ చోట దీనికి అడ్డుకట్ట వేయాలన్నది గత వైఎస్సార్ సీపీ నిర్ణయం. దీనిపై కూటమి నాడు రాద్ధాంతం.. నేడు రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం.. అయితే పరికరాలు లేకనే చేయాలని ఆదేశం.. ఎలా చేయాలి సర్వేశ్వరా? అని సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment