రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
● సెలవుల్లో బడులు నిర్వహిస్తే సీజ్ చేస్తాం ● డీఈఓ వరలక్ష్మి హెచ్చరిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2024–25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలులో ఉంటుందన్నారు. ఈ నెల 10 నుంచి 12 వ తేదీ వరకు (సెల్ఫ్ ప్రిపరేషన్ అట్ హోమ్), ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండదన్నారు. ఈ నెల 16 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు (సెల్ఫ్ ప్రిపరేషన్ అట్ హోమ్) ఉంటుందన్నారు. ఈ నెల 20వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు మాత్రం సెలవులుంటాయన్నారు. ప్రకటించిన సెలవుల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే అనుమతులు రద్దు చేసి పాఠశాలలు సీజ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment