11న ఎకై ్సజ్‌శాఖలో వస్తువుల వేలం
చిత్తూరు అర్బన్: చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు చెందిన పలు వస్తువుల విక్రయానికి ఈ నెల 11వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఏపీబీసీఎల్ చిత్తూరు డిపో మేనేజరు మనోహర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉపయోగించిన ఫ్రీజర్లు, ఇన్‌వర్టర్–బ్యాటరీలు, నగదు బాక్సులు, స్కానర్లు, నగదు లెక్కించే యంత్రాలను విక్రయించడానికి బహిరంగ వేలం పాట నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు పూతలపట్టులోని బండపల్లె మద్యం డిపో ప్రాంగణంలో రూ.5 వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల వారు 9177887729, 7780566131 నంబర్లలో సంప్రదించాలన్నారు.
పీఆర్సీ త్వరగా అమలు చేయాలి
– సీఎంకు వినతిపత్రం అందజేత
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల పీఆర్సీని త్వరతిగతిన అమలు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జయప్రకాష్‌నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుప్పం పర్యటనకు విచ్చేసిన సీ ఎం చంద్రబాబునాయుడికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల వేతనాల పెంపునకు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ)ని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏల మొత్తం విడు దల చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్లకు గత 12 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. హైస్కూల్ ప్లస్‌లను కొనసాగించి, ఆ కళాశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. అనంతరం సీఎం చేతుల మీదుగా అసోసియేషన్ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment