చివరి దశకు రెవెన్యూ సదస్సులు
చిత్తూరు కలెక్టరేట్:జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సదస్సులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెల 8వ తేదీ తో రెవెన్యూ గ్రామ సదస్సులు ముగియాల్సి ఉంది. అయితే పలు కారణాలతో జిల్లాలోని 16 రెవెన్యూ గ్రామాల్లో గ్రామ సదస్సులు నిర్వహించలేకపోయారు. ఈ నెల 8వ తేదీతో జిల్లాలోని 822 రెవెన్యూ గ్రామాలకుగాను 806 గ్రామాల్లో సదస్సులను పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 16 గ్రామాల్లో సదస్సులు పూర్తి చేస్తే గ్రామ సదస్సులు వంద శాతం పూర్తి అవుతాయి. ఇప్పటి వరకు నిర్వహించిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో 10,242 అర్జీలు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేశారు. అయితే వాటిలో 400 అర్జీలు పరిష్కరించారు. కాగా 9,842 అర్జీలు ఇంకా అధికారులు పరిష్కరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment