మేం చెప్పే పనులు చేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపో!
పుంగనూరు: ‘చట్టాలతో మాకు పనిలేదు.. మేం చెప్పే పనులు చేయాలి... ప్రొటోకాల్ ప్రకారం మమ్మల్ని గౌరవించాలి.. లేదంటే నువ్వు సెలవు పెట్టి వెళ్లిపో... లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకో...’’ అంటూ టీడీపీకి చెందిన ఓ వర్గం చోటా నేతలు పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌ను హెచ్చరించి, కార్యాలయం వద్ద బుధవారం బైఠాయించి ధర్నా చేశారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని దూషిస్తూ నినాదాలు చేశారు. దీంతో ము న్సిపల్ అధికారులు, సిబ్బంది విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు పట్టణానికి చెందిన ఓ చోటా టీడీపీ నేత తన అనుచరులతో కమిషనర్ మధుసూదన్‌రెడ్డిని కలిశారు. తమకు ప్రోటోకాల్ ప్రకారం గౌర వం ఇవ్వాలని, అన్ని పనులు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు లోబడి అన్ని పనులు చేస్తామని, ప్రొటోకాల్ నిబంధనల మేరకు అమలు చేస్తామని కమిషనర్ తెలిపినట్లు సమాచారం. దీనిపై ఆ నాయకుడు ఆగ్రహించి శ్రీమాకు గౌరవం ఇవ్వరా...సెలవు పెట్టి వెళ్లిపో.. లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకో అంటూ హెచ్చరిస్తూ కమిషనర్ చాంబర్ నుంచి ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయాడని సమాచారం. వెంటనే మున్సిపాలిటీ కార్యాలయం ముందు బైఠాయించారు. ‘కమిషనర్ డౌన్.. డౌన్... కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి.. నియోజకవర్గ ఇన్‌చార్జ్ లెటర్ గౌరవించరా..’ అంటూ అనేక దుర్భాషలాడుతూ నినాదాలు చేశారు. ఈ విషయమై సీఎం దృష్టికి తీసుకెళతామని కమిషనర్‌ను హెచ్చరించి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా చూసిన సిబ్బంది, అధికారులు విస్తుపోయారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కమిషనర్‌పై ఒక వర్గం ఆరోపణలు చేయడంతో మిగిలిన వర్గం కమిషనర్‌కు అండగా నిలిచారని సమాచారం. చోటా నేతల ఆరోపణలపై కమిషనర్ మధుసూదన్‌రెడ్డిని వివరణ కోరగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లెటర్ తమకు ఇవ్వలేదని, సమస్య ఏమీ చెప్పలేదని, ఇది ఆరోపణ మాత్రమేనన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేసినా స్పందించి, సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే నిబంధనల మేరకు ప్రొటోకాల్ అమలు చేస్తామని తెలిపారు. నిజాయితీగా పనిచేస్తుంటే కార్యాలయం ముందు ధర్నా చేయడం, విధులకు ఆటంకం కలిగించడం మంచి పద్ధతి కాదని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్‌కు అధికార పార్టీ చోటా నేత హెచ్చరిక
కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా
అధికార పార్టీ గ్రూపులతో అధికారుల బేజారు
Comments
Please login to add a commentAdd a comment