ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
నగరి : ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల నిర్వహించినట్లు ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. బాలాజి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వై. రాజారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రావు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిశీలకులు ఆర్కె ఎత్తిరాజ్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి బి.వేణుమాధవ్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వై విజయశంకర్ రెడ్డి (నెల్లూరు), ప్రధానకార్యదర్శిగా పి.బాలాజీ (ఉమ్మడి చిత్తూరు), కోశాధికారిగా కే.వీరభద్ర స్వామి (తూర్పుగోదావరి), ఉపాధ్యక్షులుగా ఏవి.శ్రీనివాసరావు (పశ్చిమగోదావరి), జె.శ్రీనివాసరావు (విశాఖపట్నం), టి.శ్రీనివాసరావు (విజయనగరం), కే.గౌస్ మొహిద్దీన్ (అనంతపురం), బి.శివ నారాయణరెడ్డి (కడప), సంయుక్త కార్యదర్శులుగా పి.మురళి, కే.బాల మద్దిలేటి, ఈ. శివశంకర్, ఐ. రమేష్ బాబు (నెల్లూరు), కే.సూరిబాబు (ఈస్ట్ గోదావరి) ఎన్నికయ్యారన్నారు. బాల్‌బాడ్మింటన్ అభివృద్ధికి నూతన కార్యవర్గం అవిరళ కృషి చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment