శాస్త్రోక్తంగా చండీహోమం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా చండీహోమం

Published Tue, Jan 14 2025 9:06 AM | Last Updated on Tue, Jan 14 2025 9:06 AM

శాస్త

శాస్త్రోక్తంగా చండీహోమం

చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి యాగశాలలో కొలువుదీర్చారు. అనంతరం ఈఓ ఏకాంబరం, ఉభయకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వేద పండితులు చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహిస్తున్నట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. పూర్ణాహుతి అనంతరం అధికారులు ఉభయకర్తలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఘనంగా కవి సమ్మేళనం

శ్రీకాళహస్తి: పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ధూర్జటి రసజ్ఞ సమాఖ్య సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి ఆధ్వర్యంలో సంక్రాంతి కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు సంక్రాంతి విశిష్ట త, సంస్కృతి సంప్రదాయాలు, సమాజం సమకాలీన అంశాలు, మాన విలువలతో పాటు బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్వీయ కవితలు వినిపించారు. అనంతరం ఇటీవల శాంతిపురం ఎంఈవో–2గా అదనపు బాధ్యతలు చేపట్టిన తీగల వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. కవులు గొడుగు చింత గోవిందయ్య, తీగల వెంకటయ్య, గురునాథం, బాలముని శివకుమార్‌ పాల్గొన్నారు.

సైనిక్‌ స్కూల్‌ దరఖాస్తుల గడువు 23 వరకు పొడిగింపు

తిరుపతి ఎడ్యుకేషన్‌: 2025–2026 విద్యా సంవత్సరానికి ఎంపిక పరీక్ష ద్వారా 6వ తరగతి, 9వ తరగతులకు బాల బాలికలకు అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో జరగనున్న సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు సమర్పించేందుకు గడువు 23 జనవరి 2025 వరకు పొడిగించారని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం ఉచిత పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత డాక్టర్‌ ఎన్‌.విశ్వనాథ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు వయసును బట్టి 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు చక్కటి అవకాశం ఉందన్నారు. వివరాల కోసం 86888 88802 / 93999 76999 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శాస్త్రోక్తంగా చండీహోమం 
1
1/1

శాస్త్రోక్తంగా చండీహోమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement