ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు

Published Thu, Jan 23 2025 1:44 AM | Last Updated on Thu, Jan 23 2025 1:44 AM

ఫోర్జ

ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఎంజాయిమెంట్‌ సర్టిఫికెట్‌ కోసం చిత్తూరు అర్బన్‌ తహసీల్దార్‌ కళావతి సంతకం ఫోర్జరీ జరిగింది. సంతకంతోపాటు ఆ పత్రంలోని సీలు డమ్మీ అని తేలింది. ఈ బోగస్‌ను పసిగట్టి రిజిస్ట్రర్‌ విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సాక్షి దినపత్రికలో కూడా ‘ఆగని ఫోర్జరీ దందా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తహసీల్దార్‌ తాలూకా పోలీసులకు ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు ఎంజాయిమెంట్‌ దరఖాస్తు ఫారం తదితరాలను జత కూడా చేయనున్నారు. ఫోర్జరీ దందాపై విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి స్పెల్‌ బీ పోటీల్లో

జ్యోతిషా ప్రతిభ

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏటా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్‌ బీ పోటీల్లో జిల్లా కేంద్రంలోని సంసిద్ధ్‌ క్యాంపోర్డ్‌ పాఠశాల విద్యార్థిని జ్యోతిషా ప్రతిభ చూపించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో సాక్షి స్పెల్‌ బీ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సంసిద్ధ్‌ క్యాంపోర్డ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిన జ్యోతిషా పాల్గొని, తృతీయ స్థానం సాధించింది. కాంస్య పతకంతో పాటు రూ.3 వేలు నగదు బహుమతి అందుకుంది. ఆ విద్యార్థిని రాష్ట్రస్థాయి స్పెల్‌ బీ పోటీల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు ప్రతిభ చాటిన ఆ విద్యార్థినిని బుధవారం సంసిద్ధ్‌ క్యాంపోర్డ్‌ పాఠశాల కరస్పాండెంట్‌లు సీఆర్‌.మహేష్‌ రెడ్డి, వాస శ్రీనివాస, పాఠశాల టీచర్లు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఫోర్జరీ సంతకంపై  పోలీసులకు ఫిర్యాదు  1
1/1

ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement