కార్తీక్ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి
బంగారుపాళెం: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం చెందిన జవాన్ పంగల కార్తీక్ కుటుంబానికి తక్షణం రూ.50 లక్షలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎగువరాగిమానుపెంట గ్రామంలో కార్తీక్ భౌతిక కాయాన్ని సునీల్ కుమార్‌తో పాటు జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి గోవిందరాజులు, సింగ్ విండో మాజీ అధ్యక్షులు దత్తాత్రేయరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్, ఉపసర్పంచ్ కామరాజు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు సర్దార్, ఎస్సీసెల్ నాయకుడు నాగరాజ, ఎన్‌ఆర్‌ఐ భరత్‌రెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఐరాలకు చెందిన జవాన్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 లక్షలు అందించారన్నారు. కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందించాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment