బొమ్మల తయారీపై ప్రత్యేక శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : సంకల్ప పథకం అమలులో భాగంగా బొమ్మ ల తయారీపై ప్రత్యేక సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. సంకల్ప పథకం అమలులో రిసొల్యూట్ బీ టు బీ కన్సల్టెన్సీ సభ్యులు చిత్తూరు జిల్లాలో పర్యటించారన్నారు. ఆ బృందం సభ్యులు జిల్లాలోని పలమనేరు మండలం గంటావూరులో టెర్రకోట మట్టి కుండలు, బొమ్మల తయారీ కేంద్రం, జీడీ నెల్లూరు మండలం కడపగుంటలో ఉన్న తెల్లజిల్లేడు వినాయక బొమ్మల తయారీ కేంద్రాలను పరిశీలించారన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూచనలను బృంద సభ్యులు తీసుకున్నట్లు తెలిపారు. మట్టి బొమ్మల తయారీదారులకు, తెల్ల జిల్లేడు బొమ్మల తయారీదారులకు ఏ ప్రాంతంలో లే ని విధంగా ప్రత్యేక సాంకేతికతతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వారు తయారు చేసే వస్తువులకు సదరు సంస్థ జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగింగ్ చేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెంటింగ్ సదుపాయాలు కల్పించి, గ్రామీ ణ వృత్తి కళాకారులకు అదనపు ఆదాయం కల్పించేలా చర్యలు చేపడుతున్నామని డీఆర్‌డీఏ పీడీ వెల్లడించారు.
ముగిసిన కానిస్టేబుల్
దేహదారుఢ్య పరీక్షలు
– 3,799 మందికి..1,683 మంది అర్హత
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు (ఈవెంట్స్) బుధవారంతో ముగిశాయి. గత నెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వెంట్స్ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నగరంలోని పోలీ సు శిక్షణ కేంద్రంలో ఈవెంట్స్ నిర్వహించారు. 5,238 మంది ఈవెంట్స్‌కు హాజరు కావాల్సి ఉండగా 3,799 మంది మాత్రమే హాజరయ్యా రు. ఇందులో 1,683 మంది దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించారు తదుపరి నిర్వహించ నున్న మెయిన్స్ పరీక్షలకు వీరంతా అర్హత సా ధించినట్టేనని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపా రు. కాగా పలువురు అభ్యర్థులు వారికి నిర్ణయించిన తేదీల్లో హాజరు కాకపోవడంతో బుధవారం ఆఖరి అవకాశాన్ని కల్పించారు. ఇందు లో పాల్గొన్న పలువురు అర్హత సాధించారు.
దేశ భద్రతలో కీలకపాత్ర పోషించావు.. అరాచక శక్తుల నుంచి కంటికి రెప్పలా దేశ ప్రజలను కాపాడావు.. భరతమాత సేవకు కంకణబద్ధుడివై కఠోర శిక్షణ పొందావు.. ఉగ్రమూకల ఆట కట్టించడంలో అలుపెరగని పోరు సాగించావు.. ఈ పోరులో అశువులు బాసిన ఓ వీరుడా.. నీ త్యాగం చిరస్మరణీయం.. అజరామరం.. సైనికుడా అమరహే.. అంటూ ఎగువరాగిమానుపెంట వాసులు జవాన్ కార్తీక్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాలతో నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment