దివ్యాంగుల పింఛన్లపై విచారణ
పాలసముద్రం : మండలంలోని 85 శాతానికి పైగా వైకలత్వం ఉండి మంచానికే పరిమితమై ప్రభు త్వం ద్వారా రూ.15 వేలు పింఛన్ పొందుతున్న దివ్యాంగులను బుధవారం వైద్యాధికారుల బృందం విచారణ జరిపింది. కోస్తా జిల్లా ఉదయగిరి తీర్థం డాక్టర్ శివరామ్, అల్లూరు నుంచి అనురాధ, వెంకటగిరికోట నుంచి విజయకాంత్, తీర్థం నుంచి శివకుమార్, తిరుపతి రుయా ఆస్పత్రి డాక్టర్ కృష్ణకుమార్, సూర్యుడు, డిజిటల్ అసిస్టెంట్ డార్విన్, చంద్రశేఖర్ బృందం మండలంలోని 13 పంచాయతీల్లో మొత్తం 45 మంది మంచానికే పరిమితమైన పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై విచారణ జరిపారు. మంచానికే పరిమితమైన పింఛన్‌దారులకు ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ ఇవ్వలేక, వారి వైకల్య సర్టిఫికెట్‌లోని పర్సెంటేజీని తగ్గించి, వారిని రూ.4 వేలు, రూ.6 వేలు పింఛన్‌దారులుగా కుదింపు చేసేందుకే ఈ విచారణ చేపట్టారని, లేకుంటే పింఛన్ తొలగిస్తారోరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పింఛన్ పెంచామని కూటమి ప్రభుత్వం ఊదరగొడుతోంది. కూటిమి సర్కారు గత ప్రభు త్వం ఇస్తున్న పింఛన్‌ని ఏదో ఒకసాకు చూపి తొలగించి ఆ సొమ్మునే కొందరికి ఇవ్వడానికి చూస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment