ఆలయ వార్షికోత్సవ పూజల్లో పెద్దిరెడ్డి
సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లెలోని సదుమ మ్మ ఆలయంలో నిర్వహించిన వార్షికోత్సవ పూజల్లో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి దంపతులు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహిళలు పొంగళ్లతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వ్యవసాయ సలహామండలి జిల్లా మాజీ సభ్యుడు సుధీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నిహాంత్ రెడ్డి, అభినయ్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment