ప్రభుత్వ స్థలాలకు ‘పచ’్చ రంగు!
చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రస్తుతం పచ్చ రంగులతో నిండిపోయింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ భవనాలపై శుభాకాంక్షల బోర్డులు రాయించారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి బస్టాండు (పాత బస్టాండు) చుట్టూ పచ్చ రంగులతో ఏర్పాటు చేసిన రేకులు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్రహరీ ఏర్పాటు చేయడం సబబే కానీ, ఇలా ఓ పార్టీకి చెందిన రంగులు పులమడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ షీట్లు ఏర్పాటు చేస్తున్న విషయం కార్పొరేషన్ అధికారులకు తెలియకపోవడం, టెండర్లు కూడా పిలవకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment