40 లీటర్ల సారా పట్టివేత
కార్వేటినగరం : శ్రీరంగరాజపురం మండలంలోని చిన్న తయ్యూరు, ఎల్లం పల్లెలో ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించి 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సారా తయారీపై సమాచారం అందడంతో సిబ్బందితో కలసి దాడులు చేపట్టామన్నారు. ఈ మేరకు సారా సీజ్ చేశామని, 12 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వెల్లడించారు. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్ మునిసుందరం, సిబ్బంది రామచంద్రయ్య, సురేంద్రబాబు, విజయ్‌కుమార్, గీత పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పలమనేరు : పట్టణంలోని పద్మశ్రీ వెనుక మదనపల్లె రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. స్థానిక రఘవీరారెడ్డి కాలనీకి చెందిన మొగిలప్ప(70) ద్విచక్రవాహనంపై వెళతుండగా ఆటో ఢీకొంది. దీంతో ఆయన కింద పడగా, పక్కనే ట్రాక్టర్ ట్రాలీకి తలకు తగిలింది. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యంలో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment