ప్రేమపెళ్లి.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. పాపం | Couple Attempts End Life Deceased Visakhapatnam | Sakshi
Sakshi News home page

ప్రేమపెళ్లి.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. పాపం

Published Fri, Apr 23 2021 2:04 PM | Last Updated on Fri, Apr 23 2021 4:25 PM

Couple Attempts End Life Deceased Visakhapatnam - Sakshi

రోలుగుంట (చోడవరం): చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన ఓ వివాహిత మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని కుసర్లపూడికి చెందిన కృపా కమల, సూదివరపు సురేష్‌ ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం లేకపోవడంతో కులాంతర వివాహం చేసుకుని జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. వీరికి మూడు నెలల క్రితం పాప పుట్టింది. తరువాత స్వగ్రామం కుసర్లపూడి వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో గత 17వ తేదీన ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో సురేష్‌ అదే రోజు మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న కృపా కమలను స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై ఆయన గ్రామంలో విచారణ జరిపారు. తల్లిదండ్రుల మృతితో మూడు నెలల పసికందు అనాథగా మారింది.   

చదవండి: హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement